జూన్ 5 ఎంసెట్ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్-2018కు సంబంధించి సీట్ల కేటాయింపు జూన్ 5 సాయంత్రం నుంచి చేపట్టనున్నట్లు కన్వీనర్ జీఎస్ పండాదాస్ తెలిపారు.
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 1,12,877 మంది ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకోగా 65,530 మంది ఆప్షన్లు నమోదు చేశారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా టాప్ ర్యాంకర్లు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. వెయి్య లోపు ర్యాంకర్లలో ఆప్షన్లు నమోదు చేసిన వారు కేవలం 175 మంది మాత్రమే. ఎక్కువ మంది జేఈఈతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని కాలేజీల్లో ప్రమాణాలు తీసికట్టుగా ఉండడంతో పాటు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం, క్యాంపస్ సెలక్షన్లకు హైదరాబాద్ చుట్టూ ఉన్న కాలేజీలకే కంపెనీలు ప్రాధాన్యమిస్తుండడంతో ఇక్కడి కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 5 వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో 2094 మంది ఆప్షన్లు నమోదు చేశారు.
Published date : 05 Jun 2018 03:03PM