Skip to main content

జూన్ 27 నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం జూన్ 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని తెలంగాణ ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
జూన్ 20న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీలైనంత త్వరగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంసెట్‌కు జూన్ 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో జూన్27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే అదే రోజునుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఫీజుల వ్యవహారంలో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జూన్ 27 నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయా లేదా అన్నది మరో సారి తెలియజేస్తామని మండలి చైర్మన్ పాపి రెడ్డి పేర్కొన్నారు. జూన్ 27లోగా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి, కోర్టులో నిర్ణయం వెలువడితే యథావిధిగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగి స్తామని, లేకపోతే కొంత ఆలస్యం అవుతుం దని చెప్పారు. ఈలోగా కాలేజీల అనుబంధ గుర్తింపు వస్తుందని, ఫీజులపై స్పష్టత వస్తుందని వివరించారు. ఎంసెట్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌సైట్ (https://tseamcet.nic.in) జూన్ 24 నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జూన్ 22 నుంచి ప్రారంభించేలా షెడ్యూల్ జారీ చేసింది. జూన్ 24 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.

అనుకున్న చోట వెరిఫికేషన్...
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరింత సులభం కానుంది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ కోసం ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీ ల్లో, వీలైన సమయంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఎంసెట్ ప్రవేశాల షెడ్యూల్..ఎంసెట్ ప్రవేశాల షెడ్యూల్..
  • 24-6-2019 నుంచి 1-7-2019 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ల ఎంపిక.
  • 27-6-2019 నుంచి 3-7-2019 వరకు: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
  • 27-6-2019 నుంచి 4-7-2019 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం.
  • 4-7-2019: ముగియనున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ.
  • 6-7-2019: ప్రాథమికంగా సీట్ల కేటాయింపు.
  • 6-7-2019 నుంచి 12-7-2019 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
ఈసెట్ ప్రవేశాల షెడ్యూల్..
  • 22-6-2019 నుంచి 23-6-2019 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ల ఎంపిక.
  • 24-6-2019 నుంచి 26-6-2019 వరకు: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • 24-6-2019 నుంచి 27-6-2019 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం.
  • 27-6-2019: ముగియనున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియు.
  • 29-6-2019: ప్రాథమికంగా సీట్ల కేటాయింపు.
  • 29-6-2019 నుంచి 4-7-2019 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
Published date : 21 Jun 2019 04:31PM

Photo Stories