Skip to main content

జూన్ 24 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జూన్ 24 నుం చి ప్రారంభించేందుకు ప్రవేశాల కమిటీ జూన్ 17న కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ చేసింది.
ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, పాలిటెక్నిక్ డిప్లొ మా పూర్తి చేసిన విద్యార్థులు బీఈ/ బీటెక్/ఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో (ల్యాటరల్ ఎంట్రీ) చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని 14 వేల సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనుంది. విద్యార్థులు జూన్ 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో (https://tsecet.nic.in) రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. వారికి జూన్ 25 నుంచి 27వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు 25 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. 30న సీట్లను కేటాయిస్తామని తెలిపింది. సీట్లు పొందిన వారు జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించింది.
Published date : 18 Jun 2018 04:00PM

Photo Stories