జూన్ 16 నుంచి ట్రిపుల్ ఐటీల్లో సర్టిఫికెట్ల పరిశీలన
Sakshi Education
నూజివీడు: ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 16, 17, 18వ తేదీల్లో జరుగుతుందని నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి ఏవో రమాకాంత్ తెలిపారు.
దివ్యాంగులకు ఈ నెల 16న, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఈ నెల 16, 17తేదీల్లో, మాజీ సైనిక ఉద్యోగుల కోటాలో దరఖాస్తు చేసిన వారికి, ఎన్ సీ సీ కోటా అభ్యర్థులకు 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్టు వివరించారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులను మాత్రమే దీనికి హాజరుకావాలని పేర్కొన్నారు.
Published date : 15 Jun 2017 01:42PM