Skip to main content

జూన్ 11న కేఎల్ వర్సిటీ కౌన్సెలింగ్

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకర్లకు కె.ఎల్.విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి జూన్ 11న వర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు.
శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఐటీ సర్వీసెస్ డెరైక్టర్ ఎ.హర్ష, పీఆర్వో హెచ్.ఎస్.ఆర్.మూర్తితో కలసి ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ వర్సిటీగా తమ వర్సిటీ గుర్తింపు పొందినట్లు, కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 59 స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్‌లో 1 నుంచి 40 వేల లోపు ర్యాంకులు సాధించిన వారు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. మొదటి 10 ర్యాంకర్లకు పూర్తి ఉచిత విద్య, ఉత్తమ ర్యాంకర్లకు మెరిట్ స్కాలర్‌షిప్ అందించనున్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్, ఓపెన్ కేటగిరీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Published date : 30 May 2016 02:55PM

Photo Stories