జనవరి 5 నుంచి గేట్-2018 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2018 అడ్మిట్ కార్డులు జనవరి 5నుంచి ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐఐటీజీ వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి కార్డును పొందవచ్చు. ఇందులో అభ్యర్థుల పేరు, రోల్ నెంబరు, పరీక్ష తేదీ, సమయంతోపాటు పరీక్ష కేంద్రం వివరాలూ ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డుతోపాటు ఏదైనా గుర్తింపు ధ్రువపత్రం(పాస్‌పోర్ట్/ఆధార్ కార్డ్/ పాన్ కార్డ్/ ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లెసైన్స్) తప్పకుండా తీసుకురావాలి. లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. www.gate.iitg.ac.in వెబ్‌సైట్నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్చేసుకోవచ్చు.
Published date : 04 Jan 2018 01:01PM