జెఈఈ మెయిన్- ఆఫ్‌లైన్ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనూ పరీక్షలు
Sakshi Education
హైదరాబాద్: జేఈఈ-మెయిన్ 2014 పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనూ ఆ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో జేఈఈ-మెయిన్ పరీక్ష నిర్వహించాలనుకుంటున్న హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం, తిరుపతి, వరంగల్లు పట్టణాల్లోని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షను కూడా నిర్వహిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలు, దరఖాస్తు వివరాలు మొదలైన జేఈఈ-మెయిన్ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం www.jeema-in.nic.in వెబ్‌సైట్‌లో ఉంది.
Published date : 27 Nov 2013 10:54AM