జేఎన్‌టీయూకే ద్వారానే బీఆర్క్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ కళాశాలల 2015-16 బ్యాచ్ విద్యార్థులకు కాకినాడ జేఎన్‌టీయూ ద్వారానే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఉమ్మడి ఏపీలోని ఈ కాలేజీలు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నె హ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) పరిధిలో ఉండేవి. వీటిల్లోని విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ చేపట్టేది. ఈ కాలేజీలను జేఎన్‌టీయూకే పరిధిలో ఇంతకుముందే చేర్చినా పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది. విద్యార్థులు కొన్ని సంవత్సరాల పరీక్షలను జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ద్వారా రాశారు. వీరికి మిగతా పరీక్షలూ ఇదే వర్సిటీ నిర్వహించాల్సి ఉన్నా ఆ సంస్థ విముఖం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వీరికి పరీక్షలు నిర్వహించే విషయమై జేఎన్‌టీయూకే జాతీయ ఆర్కిటెక్చర్ మండలి నుంచి అనుమతులు పొందింది. పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరింది. గతంలోని బ్యాచ్‌ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు జేఎన్‌టీయూకేకి అనుమతులు ఇచ్చింది. ఫార్మసీ కోర్సులకు 2016-17 నుంచి 2018-19 వరకు వర్తించేలా ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఫార్మసీ కోర్సుల ఫీజులు ఖరారు :
ఫార్మసీ కోర్సులకు 2016-17 నుంచి 2018-19 వరకు వర్తించేలా ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బీఫార్మసీకి రూ.35 వేలు, ఫార్మా -డీ, ఫార్మా- పీబీలకు రూ.68 వేలు, ఎంఫార్మసీకి రూ.1,10,000 చొప్పున ఫీజు ఖరారు చేశారు.
ఫార్మసీ కోర్సుల ఫీజులు ఖరారు :
ఫార్మసీ కోర్సులకు 2016-17 నుంచి 2018-19 వరకు వర్తించేలా ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బీఫార్మసీకి రూ.35 వేలు, ఫార్మా -డీ, ఫార్మా- పీబీలకు రూ.68 వేలు, ఎంఫార్మసీకి రూ.1,10,000 చొప్పున ఫీజు ఖరారు చేశారు.
Published date : 06 Jul 2016 02:56PM