జేఎన్టీయూహెచ్‌లో 32 పోస్టులకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ హైదరాబాద్‌లో 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీ మార్చి 3న నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను ఏప్రిల్8లోగా వర్సిటీలో అందజేయాలని పేర్కొంది. కేటగిరీల వారీగా పోస్టులు, అర్హతలకు సంబంధించిన సమగ్ర వివరాలను త్వరలోనే అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.
Published date : 04 Mar 2019 02:44PM