Skip to main content

జేఎన్‌టీయూఏ పరిధిలోకి స్కిట్ కళాశాల

సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) ఇంజనీరింగ్ కళాశాలను అనంతపురం జేఎన్‌టీయూకి 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి ఆగస్టు31న అంగీకారం కుదిరింది.
దీనిపై ఆగస్టు31న అమరావతిలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మన్మోహన్‌సింగ్, కమిషనర్ అనురాధ, జేఎన్‌టీయూఏ వైస్ చాన్సలర్, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో భ్రమరాంబ, స్కిట్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డిల మధ్య చర్చలు జరిగాయి. మరో వారం రోజుల్లో జేఎన్‌టీయూకి చెందిన కమిటీ స్కిట్ కళాశాలను పరిశీలించి ఏడాదికి ఎంత లీజు చెల్లించనున్నారో తెలియజేస్తారు.
Published date : 01 Sep 2017 02:01PM

Photo Stories