జేఎన్టీయూ బీటెక్, బీఫార్మసీ పరీక్షలు వాయిదా
Sakshi Education
హైదరాబాద్: జేఎన్టీయూ(హెచ్) పరిధిలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న బీటెక్, బీ ఫార్మసీ పరీక్షలను వాయిదా వేసినట్టు డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు.
ఈ నెల 26వ తేదీన జరుగనున్న బీ ఫార్మసీ పరీక్ష 27న జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న ఉదయం, మధ్యాహ్నం జరిగే బీటెక్ పరీక్షలు జనవరి 5వ తేదీ ఉదయం, మధ్యాహ్నం...అలాగే జనవరి 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం జరిగే బీటెక్ పరీక్షలు 9న ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయన్నారు. ఈ మేరకు వివరాలను విద్యార్థులు గమనించాలని కోరారు.
Published date : 25 Dec 2014 01:03PM