ఈసీఈ విద్యార్థినికి 4 గోల్డ్ మెడల్స్
Sakshi Education
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ విద్యార్థిని కె.కావ్య నాలుగు బంగారు పతకాలు సాధించింది. 2012-13వ బ్యాచ్‌లో వర్సిటీ పరిధిలోని బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ బ్రాంచిలో చదివిన కావ్య శనివారం జరగనున్న స్నాతకోత్సవంలో ఈ పతకాలను అందుకోనుంది. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్‌గా, మరో 3 ఎండోమెంట్ గోల్డ్ మెడల్స్‌ను అందుకుంటుంది. మాథ్స్‌లో అత్యధిక మార్కులు సాధించినందుకు జి.పురుషోత్తం మెమోరియల్ గోల్డ్‌మెడల్, పిసుపాటి సుప్రియాదేశాయ్ గోల్డ్‌మెడల్, వర్శిటీ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గోల్డ్‌మెడల్ అందుకోనుంది. కావ్య ఈసీఐఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తోంది.
Published date : 09 Nov 2013 12:37PM