Skip to main content

ఈసెట్‌లో 96.53 శాతం ఉత్తీర్ణత

జేఎన్‌టీయూ (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2016 ఫలితాలను బుధవారం జేఎన్‌టీయూ అనంతపురంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారు.
మొత్తం 34,739 మంది పరీక్షలకు హాజరుకాగా, 33,535 మంది (96.53శాతం) అర్హత సాధించారు. అబ్బాయిలు 27,316 (96.20 శాతం), అమ్మాయిలు 6,219 మంది (98.05 శాతం) అర్హత పొందారు. ఫలితాలతో పాటు ఫైనల్ ‘కీ’ని విడుదల చేశారు. జూన్ 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
  • పరీక్షలకు అత్యధికంగా మెకానికల్ బ్రాంచ్ నుంచి 10,037 మంది హాజరుకాగా 96.92శాతంతో 9,782 మంది అర్హత పొందారు. అలాగే బయోటెక్నాలజీలో ఒకరు, సిరామిక్ టెక్నాలజీలో ఇద్దరు మాత్రమే పరీక్ష రాశారు. వీరు అర్హత సాధించడంతో పాటు ఆయా విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు!
  • వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో 10 శాతం, అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 20 శాతం ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు ఏపీఈసెట్‌కు కేటాయిస్తారు. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు.

బ్రాంచ్‌ల వారీ ప్రథమ స్థానం సాధించిన వారి వివరాలు
శివాల శ్రీనివాసరావు(బీఎస్సీ మేథమేటిక్స్), పోతల సాయి కుమార్ (కెమిస్ట్రీ), యు.నాగ నీరజ(సీఎస్‌ఈ), వి.వెంకట సుబ్రహ్మణ్యం (సివిల్), ఎం.తనూజ(ఈసీఈ), సి.గణేశ్ కుమార్ (ఈఈఈ), ఎన్.సిద్ధార్థ (ఈఐఈ), బి.సాయి సునీల్ కుమార్(మెకానికల్), వి.విఎస్‌ఎన్ పరదేశీ నాయుడు (మెటలర్జి), ఎం.అజయ్‌కుమార్ (మైనింగ్), ఎస్.వెంకట మహాలక్ష్మి (ఫార్మసీ), ఎం.దేవికా రాణి(బయో టెక్నాలజీ), ఏ.మణికంఠస్వామి (సిరామిక్ టెక్నాలజీ).
Published date : 19 May 2016 03:51PM

Photo Stories