Skip to main content

Engineering: పెరిగిన ఫీజులు వెంటనే కాలేజీల్లో కట్టాలి

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తిరిగి ఇవ్వాల్సిన ఫీజులపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది.
Engineering
పెరిగిన ఫీజులు వెంటనే కాలేజీల్లో కట్టాలి

అయితే, డేటా క్రోడీకరణ పూర్తవ్వని కారణంగా ఫీజులు ఎప్పుడిస్తామో స్పష్టంగా చెప్పలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఫీజుల పెంపు తర్వాత కాలేజీలకు చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని కాలేజీల్లోనే ఇవ్వాలన్నారు. తొలిదశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదలయ్యే నాటికి ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులు ఖరారు కాలేదు. దీంతో 2019లో ఉన్న ఫీజులనే వసూలు చేయాలని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మొదటి దశ సీట్ల కేటాయింపులో సీట్లు పొందిన విద్యార్థులంతా ఇదే మాదిరిగా ఫీజులు చెల్లించారు. అయితే, ఆ తర్వాత ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) సిఫార్సు మేరకు ప్రభుత్వం ఫీజుల పెంపు జీవోను జారీ చేసింది. దీనికి అనుగుణంగా కొన్ని కాలేజీల్లో ఫీజులు పెరగగా, మరికొన్ని కాలేజీల్లో ఫీజులు తగ్గాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యే వరకూ విద్యార్థులు చెల్లించే ఫీజులన్నీ సాంకేతిక విద్య విభాగం ఖాతాలోనే ఉంటాయి. సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత ఆ ఫీజులను సంబంధిత కాలేజీలకు పంపుతారు. 

చదవండి: బీటెక్‌ తర్వాత ఉన్నత విద్యా లేక ఉద్యోగమా.. మీ దారెటు?

సీజీజీ వద్ద డేటా 

మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీల ఫీజు రూ.1.34 లక్షలు ఉంటే, ఇప్పుడు అది రూ. 1.05 లక్షలకు తగ్గింది. అదేవిధంగా చాలా కాలేజీల్లో రూ.35 వేలున్న ఫీజులు రూ. 45 వేలకు పెరిగాయి. దీంతో ఫీజులు తగ్గిన కాలేజీల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ వద్ద ఉన్న ఫీజుల్లో కొంత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థుల డేటా మొత్తం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) విభాగం వద్ద ఉంటుందని, అక్కడ్నుంచి డేటా తీసుకున్న తర్వాతే ఫీజులు తిరిగి ఇవ్వగలమని అధికారులు అంటున్నారు. 

చదవండి: బీటెక్‌లోని వివిధ కోర్సుల విద్యార్థులు నేర్చుకోవాల్సిన స‌ర్టిఫికేట్ కోర్సుల ఇవే..!

Published date : 03 Nov 2022 01:01PM

Photo Stories