ఈనెల 4న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీల ఖరారు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలను జూలై 4న ఖరారు చేయనున్నారు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 10వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వీలుకాకపోతే 12 లే దా 13 తేదీల్లో కౌన్సెలింగ్‌ను ఎలాగైనా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు సమావేశమై ఈ అంశాలపై చర్చించి, ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు.
15లోగా మొదటిదశ పూర్తిచేయాలి: ఏఐసీటీఈ
ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో మొదటి దశ ప్రవేశాలను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు, వర్సిటీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసింది.

Published date : 03 Jul 2014 05:44PM