ఇంజనీర్ల నియామక ప్రకటన సరికాదు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెడికల్ ఉపకరణాల నిర్వహణకు సంబంధించి తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిమ్యాటిక్ అండ్ బయోమెడికల్ సర్వీసెస్ (టీబీఎస్) ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టునాశ్రయించింది.
తమకు రావాల్సిన రూ.47 కోట్ల మేర బకాయిలను చెల్లించకుండానే బయోమెడికల్ ఇంజనీర్ల నియామక ప్రకటనివ్వడం సరికాదని పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యాజ్యంపై అక్టోబర్ 21న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. తదుపరి విచారణను న్యాయమూర్తి 29కి వాయిదా వేశారు.
Published date : 22 Oct 2019 03:46PM