ఇంజనీరింగ్‌లో1.04 లక్షల సీట్లే భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరైనవారిలో 1,04,096 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 575 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 2,70,125 సీట్లు ఉండగా, అందులో కన్వీనర్ కోటాలో 1,89,088 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 1,16,029 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా, శుక్రవారం సాయంత్రం వరకు 1,04,096 మంది విద్యార్థులే కాలేజీల్లో చేరారు. మిగిలిన 11,933 మంది విద్యార్థులు సీట్లు లభించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా చేయించుకున్నారు. అయితే, కాలేజీల్లో మాత్రం చేరలేదు. ఇంకా కన్వీనర్ కోటాలోనే 84,992 సీట్లు మిగిలిపోయాయి.
Published date : 06 Sep 2014 11:42AM