Skip to main content

ఇంజనీరింగ్‌లో ఎన్‌సీసీ ప్రాధాన్యాలు మార్పు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1 శాతం ఎన్‌సీసీ కోటా సీట్ల కేటాయిం పులో ప్రాధాన్యాలను మార్పు చేస్తూ ఈనెల 9న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు.
మొదటి ప్రాధాన్యం గ్యాలంటరీ/ నేషనల్ బ్రేవరీ అవార్డు సాధించిన వారికి ఇవ్వాలని పేర్కొన్నారు. అందులోనూ 3 కేటగిరీలను చేర్చారు. రెండో ప్రాధాన్యం రిపబ్లిక్ డే క్యాంపులో బంగారు, వెండి, రజత పతకం సాధించిన వారికి ఇవ్వాలని పేర్కొన్నారు. వీటిలో మరో 7 అంశాలను ప్రాధాన్య క్రమంలో పేర్కొన్నారు. ఆ తర్వాత మూడో ప్రాధాన్యం రాష్ట్ర స్థాయిలో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న వారికి ఇవ్వాలని సూచించారు. వాటిలోనూ మూడు కేటగిరీల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు.
Published date : 10 Jun 2017 03:12PM

Photo Stories