ఇంజనీరింగ్‌లో ఎలక్టివ్ సబ్జెక్టుగా వేదిక్ సైన్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: క్రీస్తు పూర్వమే భారతీయులకు వైమానిక శాస్త్రం గురించి తెలుసా..?
మహాభారత కాలం నాడే టెస్టుట్యూబ్ బేబి టెక్నాలజీ వాడుకలో ఉండేదా..? వంటి విషయాలను ఇకపై ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకోనున్నారు. బీటెక్‌లో ఎలక్టివ్ సబ్జెక్టుగా వేదిక్ సైన్స్ ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఏఐసీటీఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఏఐసీటీఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వేదిక్ సైన్స్ సబ్జెక్టు కోసం భారతీయ విద్యాభవన్ ప్రచురించిన ‘భారతీయ విద్యా సార్’పుస్తకాన్ని ఎంచుకుంది.
Published date : 10 Nov 2018 01:17PM