ఇంజనీరింగ్ విద్యలో మార్పులు అవసరం
Sakshi Education
భీమవరం టౌన్: ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పుల ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ డి.సహస్రబుధ్ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 27న ఇన్నోవేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ డి.సహస్రబుధ్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో సిలబస్ మార్చాలని లేదంటే ఏఐసీటీఈ రూపొందించిన పాఠ్యాంశాలను యూనివర్సిటీలు ఉపయోగించుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు శాటిలైట్స్ ప్రయోగించాలన్నారు.
Published date : 29 Jan 2018 02:41PM