ఇంజనీరింగ్ విద్యకూ ‘నీట్’ తరహా పరీక్ష!
Sakshi Education
న్యూఢిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ‘నీట్’ ప్రవేశ పరీక్ష తరహాలో దేశవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్రమానవ వనరుల శాఖ యోచిస్తోంది.
జేఈఈ ఎగ్జామ్‌ను ఏకీకృత పరీక్షగా మార్చేందుకు సంబంధించి మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలోని హెచ్‌ఆర్‌డీ శాఖలో అత్యున్నత స్థారుులో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించారుు. 2018 విద్యాసంవత్సరం నుంచి ప్రతిపాదిత పరీక్షను నిర్వహించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించారుు. ప్రస్తుతం జేఈఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది.
Published date : 23 Dec 2016 04:13PM