Skip to main content

ఇంజనీరింగ్ విద్యార్థులకు వెయ్యికి పైగా శాంసంగ్ జాబ్స్

డిసెంబర్ 1 నుంచి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
న్యూఢిల్లీ: గృహోపకరణాల దిగ్గజం శామ్‌సంగ్ ఇండియా వెయ్యిపైగా ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలనివ్వనున్నది. వీటిల్లో 300 మందిని వివిధ ఐఐటీల నుంచి తీసుకుంటామని శామ్‌సంగ్ ఇండియా హెడ్ (హ్యూమన్ రిసోర్సెస్) సమీర్ వాధ్వాన్ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఢిల్లీ, కాన్సూర్, బాంబే, మద్రాస్, ఖరగ్‌పూర్, గౌహతి, రూర్కీ ఐఐటీల్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్త ఐఐటీలైన హైదరాబాద్, ధన్‌బాద్, రోపార్, ఇండోర్, గాంధీనగర్, పట్నా, భువనేశ్వర్, మండి, జోధ్‌పూర్‌లతో పాటు ప్రీమియమ్ ఇంజనీరింగ్ కాలేజీలు-బిట్స్ పిలానీ, ట్రిపుల్‌ఐటీలు, ఎన్‌ఐటీలు, ఢిల్లీ టెక్నాలజీ యూనివర్శిటీ, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఎస్‌ఈ బెంగళూరుల్లో కూడా క్యాంపస్ సెలక్షన్‌లు నిర్వహిస్తామని వివరించారు. కొత్త ఉద్యోగాల్లో అధిక భాగం మర మేధ, మెషీన్ లర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కెమెరా టెక్నాలజీ, 5జీ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఉంటాయని వాధ్వాన్ చెప్పారు.
Published date : 28 Nov 2018 03:34PM

Photo Stories