Skip to main content

ఇంజనీరింగ్, ఫార్మాలో 97 శాతం సీట్లు ప్రైవేట్ కాలేజీల్లోనే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సులకు సంబంధించి అత్యధిక సీట్లు ప్రైవేట్ కాలేజీల్లోనే ఉండడంతో ప్రైవేట్ చదువులుగా మారిపోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కే పెద్దపీట వేస్తూ ప్రోత్సహించటంతో విద్యార్ధులంతా వాటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. సదుపాయాలున్నా లేకున్నా అవే దిక్కుగా మారాయి. యూనివర్సిటీ కాలేజీల్లో సీట్ల కోసం ఎక్కువమంది పోటీపడుతుంటారు. ప్రైవేట్ వాటిల్లో కన్నా వర్సిటీ కాలేజీల్లో బోధన బాగుంటుందన్న ఉద్దేశంతో అటువైపు చూస్తుంటారు. సర్కారు కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో మెరిట్ ర్యాంక్‌తో అగ్రస్థానంలో ఉన్నవారికే అవకాశం దక్కుతోంది. మిగతా విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలను ఆశ్రయించక తప్పటం లేదు.

421 కాలేజీలు... 1,66,373 సీట్లు
రాష్ట్రంలో ఇటీవల ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన 421 కాలేజీల్లో ఫార్మా, ఇంజనీరింగ్ సీట్లు 1,66,373 వరకు ఉన్నాయి. ఇందులో వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు 20 వరకు ఉండగా అందులో సీట్లు 4,930 మాత్రమే ఉన్నాయి. అదే ప్రైవేట్‌లో 401 కాలేజీలుండగా 1,61,443 సీట్లున్నాయి (డీమ్డ్ వర్సిటీలతో కలిపి). ప్రైవేట్‌లో 97 శాతం సీట్లు ఉండగా ప్రభుత్వ సీట్ల సంఖ్య కేవలం 3 శాతమే ఉంది. ఇంజనీరింగ్, ఫార్మా సీట్లలో గుంటూరు జిల్లా అత్యధిక సంఖ్యతో అగ్రస్థానంలో ఉంది. తదుపరి రెండు స్థానాల్లో కృష్ణా, చిత్తూరు జిల్లాలున్నాయి. గుంటూరు జిల్లాలో 42 ఇంజనీరింగ్ కాలేజీలుండగా ఏఐసీటీఈ 21,018 సీట్లకు అనుమతి ఇచ్చింది. కృష్ణా జిల్లాలో 34 కాలేజీలుండగా 18,552 సీట్లు ఉన్నాయి. చిత్తూరులో 30 కాలేజీల్లో 16,530 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

గుర్తింపు ప్రక్రియ ముగిసేది ఎప్పుడో?
ఏఐసీటీఈ అనుమతులు పొందిన కాలేజీలు నిబంధనల ప్రకారం సిబ్బందిని నియమించాయా? మౌలిక సదుపాయాలున్నాయా? అనే అంశాలను పరిశీలించాకే వర్సిటీలు గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు. మే 26 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో. పరిశీలన ప్రక్రియ సకాలంలో పూర్తయితేనే కౌన్సెలింగ్ చేపట్టటానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

వర్సిటీ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు :

జిల్లా

ఇంజనీరింగ్

ఫార్మా

 

కాలేజీలు

సీట్లు

కాలేజీలు

సీట్లు

అనంతపురం 2 600 2 120
చిత్తూరు 4 1380 1 40
తూ.గోదావరి 1 250 1 60
గుంటూరు 1 300 1 100
కృష్ణా 1 420 - -
విశాఖపట్నం 1 400 1 40
విజయనగరం 1 270 - -
వైఎస్సార్ 3 950 - -
మొత్తం 14 4,570 6 360


రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు:

జిల్లా

ఇంజనీరింగ్

ఫార్మా

కాలేజీలు

సీట్లు

కాలేజీలు

సీట్లు

అనంతపురం 14 6426 2 200
చిత్తూరు 30 16530 8 760
తూ.గోదావరి 30 15510 13 1100
గుంటూరు 42 21018 22 2015
కృష్ణ 34 18552 11 1100
కర్నూలు 12 6000 7 620
నెల్లూరు 23 11130 10 980
ప్రకాశం 17 9030 9 700
శ్రీకాకుళం 6 3210 2 200
విశాఖపట్నం 28 14092 7 610
విజయనగరం 12 4830 7 520
ప.గోదావరి 23 12390 9 880
వైఎస్సార్ 17 7080 6 520
మొత్తం 288 1,45,798 113 10,205
Published date : 15 May 2018 02:19PM

Photo Stories