ఇంజనీరింగ్ ప్రవేశాలు ఈసారీ లేటే?
Sakshi Education
ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర గందరగోళం<br/>
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలుతో జాప్యం
గురువారమే లిస్ట్‌లో ఉన్నా నిర్లక్ష్యం చేసిన జేఎన్టీయూహెచ్
సోమవారం నుంచి విచారణ చేపడతామన్న ధర్మాసనం
వచ్చే నెల 1వ తేదీ నాటికి తరగతుల ప్రారంభం కష్టమే!
ఆందోళనలో 70 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
సకాలంలో తరగతుల ప్రారంభానికి చర్యలు: ఉన్నత విద్యామండలి
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. కోర్టు కేసు ఎప్పుడు తేలుతుందో, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఇటు కాలేజీల యాజమాన్యాలు, అటు ప్రభుత్వం, జేఎన్టీయూహెచ్ వ్యవహరిస్తున్న తీరు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలో పడేస్తోంది. గతంలోలాగా ఈసారీ జాప్యం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టేలా చేస్తోంది. ఏఐసీటీఈ అనుమతి ఉన్న అన్ని కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై జేఎన్టీయూహెచ్ అప్పీలుకు వెళ్లడంతో.. ఇంజనీరింగ్ ప్రవేశాలు సకాలంలో జరిగే అవకాశం కనిపించడం లేదు. అప్పీలుకు వెళ్లిన జేఎన్టీయూహెచ్ కనీసం కేసు విచారణకు వచ్చే విషయంలోనూ పక్కాగా వ్యవహరించ లేకపోయింది. గురువారం కేసు లిస్ట్‌లో ఉన్నా పట్టించుకోలేదు. అత్యవసర అంశమని కోర్టుకు విజ్ఞప్తి చేసి, విచారణ జరిపేలా చూడడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో శుక్రవారం కేసు లిస్ట్ అయినా సోమవారం విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. జేఎన్టీయూహెచ్ గానీ, అడ్వొకేట్ జనరల్‌గానీ గురువారమే స్పందించి కోర్టుకు విజ్ఞప్తి చేసి ఉంటే.. శుక్రవారమే విచారణ జరిగే అవకాశం ఉండేది. ఈ విషయంలో జేఎన్టీయూహెచ్ తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎప్పటికి పూర్తయ్యేనో..?
సోమవారం కేసు విచారణ ప్రారంభమైనా వాదనలు ఎప్పటికి పూర్తయి, ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఒకవేళ ఆలస్యమైతే ఈనెలాఖరుకు ప్రవేశాలను పూర్తిచేయడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎంసెట్‌లో అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న 62,777 మంది విద్యార్థులతోపాటు ఎంసెట్‌లో మంచి మార్కులు వచ్చినా ఇంటర్‌లో ఫెయిలైన వారు దాదాపు 12 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు, వారికి జేఎన్టీయూహెచ్ సప్లిమెంటరీ ర్యాంకులను ప్రకటించింది కూడా. వారికి ఈనెల 13న (సోమవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. అంటే 70 వేల మందికిపైగా విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
నిరంతర చర్యలు చేపట్టాలి..
ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలు, అన్ని సీట్లను వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలుచేస్తే ఈ గందరగోళం ఉండేది కాదని అధికారులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అప్పీలుకు వెళ్లడం వల్లే జాప్యం జరిగే పరిస్థితి నెలకొందని అంటున్నారు. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేయడం వల్ల అనుబంధ గుర్తింపు ఇచ్చిన 220 కాలేజీల్లో మరిన్ని సీట్లు పెరగడంతోపాటు ‘గుర్తింపు’ నిరాకరించిన మరో 25 కాలేజీలకు మాత్రమే అవకాశం వస్తుందని, దానివల్ల పెద్దగా నష్టం ఉండే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు పాటించేలా చేయడమంటే సీట్లకు కోత పెట్టడం కాదని, ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం నిరంతర చర్యలు చేపట్టాల్సి ఉంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
నెలాఖరుకు పూర్తిచేసేలా చర్యలు..
ఇంజనీరింగ్ ప్రవేశాలను ఈనెలాఖరులో పూర్తి చేయాలన్నదే తమ ఉద్దేమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును ఎక్కువకాలం కొనసాగించకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తున్నామని చెప్పారు. సోమవారం జేఎన్టీయూహెచ్‌తో తాము చర్చించనున్నట్లు తెలిపారు.
అప్పీలుపై విచారణ చేపట్టండి
హైకోర్టు ధర్మాసనానికి జేఎన్టీయూహెచ్ విజ్ఞప్తి
ఏఐసీటీఈ అనుమతి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నింటికీ తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై తాము చేసిన అప్పీల్‌ను విచారించాలని జేఎన్టీయూహెచ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈనెల 8వ తేదీనే ఈ అప్పీలు కేసుల విచారణ జాబితా (కాజ్‌లిస్ట్)లో ఉన్నా.. విచారణకు నోచుకోవట్లేదు. దీంతో తమ అప్పీలుపై విచారణ చేపట్టాలని జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. సింగిల్ జడ్జి తీర్పు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీటీఈ తరఫున రమాకాంత్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ అప్పీలును సోమవారం మొదటి కేసుగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Published date : 11 Jul 2015 12:22PM