ఇంజనీరింగ్ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరే గడువును జూలై29 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది.
ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో 6,510 సీట్ల భర్తీకి జూలై30న స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సెంట్రల్ సీట్ అలకేషన్ అథారిటీ (సీఎస్ఏబీ) ప్రకటించడం.. మరోవైపు ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ పూర్తవడంతో జూలై29లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి కాలేజీల్లో చేరాలని సాంకేతిక విద్యా శాఖ పేర్కొనడంతో రాష్ట్ర విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. అధికారులతో సమావేశమై ప్రవేశాల గడువును జూలై29 నుంచి 31కి పొడిగించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం చివరి దశ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థుల మొబైల్ నంబర్లకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెంటనే సమాచారాన్ని పంపింది. జూలై31 వరకు విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చని, కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేసి చేరొచ్చని పేర్కొంది. సీట్లను రద్దు చేసుకోవాలనుకునే వారు కూడా జూలై31 మధ్యాహ్నం 2 గంటల వరకు సీట్లు రద్దు చేసుకోవచ్చని ప్రకటించింది.
బ్రాంచీ మారితే..
సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన బ్రాంచీల్లో కాకుండా ఇతర బ్రాంచీలకు మారాలనుకుంటే ఆగస్టు 3న నిర్వహించే ఇంటర్నల్ స్లైడింగ్లో పాల్గొనాలని, ఇందుకు కాలేజీల్లోనే సంప్రదించాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. క్యాంపు కార్యాలయం కేటాయించిన బ్రాంచీలో కాకుండా స్లైడింగ్ ద్వారా మరో బ్రాంచీకి మారితే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఆగస్టు 4 నుంచి 9 వరకు స్పాట్ అడ్మిషన్లు :
కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 4న యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేసి 9లోగా పూర్తి చేయాలని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను ఆగస్టు 11లోగా ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలన్నారు. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలు, డీడీలను ఆగస్టు 16లోగా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి పంపించాలని సూచించారు.

Published date : 29 Jul 2017 01:52PM