ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రవేశాలు ఖరారు చేయొద్దు...హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వు
Sakshi Education
- ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సవరణ
- లోపాలు సరిదిద్దుకోని కాలేజీలనూ వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
- ఈ కళాశాలల్లో ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దు
- కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విద్యార్థులకు చెప్పండి
- జేఎన్‌టీయూకు ధర్మాసనం ఆదేశం
- కాలేజీల పిటిషన్లపై 12 నుంచి తుది విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచన
హామీలివ్వడం మామూలే
‘కౌన్సెలింగ్‌లో ఎవరికి స్థానం కల్పించాలన్న దానిపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పినా కూడా సింగిల్ జడ్జి పట్టించుకోకుండా అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 272 ఇంజనీరింగ్ కాలేజీల్లో 266 కాలేజీలు సమాచారం వెల్లడించగా ఇందులో 145 కాలేజీలు మాత్రమే పూర్తి సంతృప్తికరమైన సమాచారం ఇచ్చాయి. 90 ఫార్మసీ కాలేజీలకు గాను 50 కాలేజీలే సంతృప్తికరంగా స్పందించాయి. పూర్తి సమాచారాన్ని పరిశీలించిన తరువాతనే అన్ని సౌకర్యాలున్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని నిర్ణయిం చాం. లోపాలున్నాయని మేం చెప్పడం, సవరించుకుంటామని కాలేజీలు లిఖితపూర్వక హామీలివ్వడం ఏటా పరిపాటిగా మారిపోయింది. అందుకనే సౌకర్యాలు లేని కాలేజీలకు కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించలేదు’
- కె.రామకృష్ణారెడ్డి (ఏజీ)
కోర్టు ఉత్తర్వులంటే జేఎన్‌టీయూకు గౌరవం లేదు
‘కాలేజీల్లో సౌకర్యాల గురించి మే, జూన్ నెలల్లోనే జేఎన్‌టీయూ తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేసింది. లోపాలే ప్రధాన సమస్య అయితే వాటి గురించి అప్పుడే కాలేజీలకు చెప్పి ఉండాల్సింది. అప్పుడు మౌనంగా ఉండి తీరా కౌన్సెలింగ్ సమయంలో లోపాలు ఉన్నాయంటూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చకపోవడం దారుణం. ప్రతి విషయంలోనూ జేఎన్‌టీయూ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వారి నిబంధనలను వారే పట్టించుకోవడం లేదు. 174 కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి గత నెల 25న ఉత్తర్వులిస్తే యూనివర్సిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వులంటే వారికి ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’
- డి.ప్రకాశ్‌రెడ్డి
(కాలేజీల తరపు న్యాయవాది)
Published date : 10 Sep 2014 01:13PM