ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ద్వారానే అడ్మిషన్లు
Sakshi Education
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎం.పి.సి స్ట్రీమ్ నాన్ ఫార్మర్ కోటా కింద బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ.ఎస్సీ (సీఏబీఎం), బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. వర్సిటీ నిర్వహించే పై కోర్సులలో ప్రవేశం కోసం అభ్యర్థులు కౌన్సిలింగ్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కోర్సులలో సంబంధించిన కోడ్‌లు, కాలేజీ కోడ్‌లు, సీట్ల వివరాలు www.pjtsau.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. తెలంగాణ ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులలో చేరడానికి అర్హులని ఆయన తెలిపారు.
Published date : 10 Jun 2015 01:24PM