ఇంజనీరింగ్ కాలేజీల్లో ల్యాబ్‌ల పటిష్టతపై దృష్టి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్ లు, నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని జేఎన్‌టీయూను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక కాలేజీల్లో పేరుకే కంప్యూటర్ ల్యాబ్‌లు ఉంటున్నాయని, చాలా వాటిల్లో పని చేయని కంప్యూటర్లు ఉన్నాయని ఉన్నత విద్యా మండలి దృష్టికి వచ్చింది. మరోవైపు కంప్యూటర్లున్నా.. నెట్‌వర్క్, బ్యాండ్‌విడ్‌త సమస్యలు వేధిస్తున్నట్లు సైతం గుర్తించింది. దీంతో కాలేజీల్లో కంప్యూటర్ సైన్‌స, ఐటీ తదితర కోర్సుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు, నెట్‌వర్క్ ఉండేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది.
ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంచేలా..
మరోవైపు ఇటీవల ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఆన్‌లైన్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా చాలా కాలేజీల్లో ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు సరిపడ సామర్థ్యం లేనట్లు తేలింది. ఓవైపు దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంటే రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల్లో లోపాలు ఉండటం సరికాదన్న భావనకు వచ్చింది. ముఖ్యంగా 500కు పైగా విద్యార్థులున్న కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు పక్కాగా ఉండేలా చూడాలని, దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నిర్ణయించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో లోపాలపై ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ చేపట్టిన అనేక సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం కాలేజీల్లో లోపాలు తగ్గుముఖం పట్టాయని ఆయన గుర్తించారు. చాలా కాలేజీల్లో రోజుకు కేవలం 6 - 7 వేల మంది విద్యార్థులకు సరిపడ మాత్రమే ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, నెట్ వర్క్ సామర్థ్యం ఉన్నట్లు తెలుసుకొన్నారు. ఈసారి 28 వేల వరకు విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి చేరుకున్నట్లు ఆదివారం ఆయన వెల్లడించారు. అయితే ఇది మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కంప్యూటర్ ల్యాబ్‌ల పటిష్టతపై మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

Published date : 23 Apr 2018 02:46PM