ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరింది 52 వేల మందే
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన 60,943 మందిలో 52,006 మంది మాత్రమే ఆయా కాలేజీల్లో చేరుతున్నట్లు రిపోర్టింగ్ చేశారు.
ఎంసెట్‌లో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రి కోర్సులకు 1.5 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్‌లో కన్వీనర్ కోటాలో 89,592 సీట్ల భర్తీకి ఇటీవల తొలివిడత కౌన్సెలింగ్ పూర్తయింది. మొత్తం 1.38 లక్షల మంది ఎంసెట్‌లో అర్హత సాధిస్తే వారిలో 66 వేల మంది వరకు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. తొలివిడత సీట్లు కేటాయించిన వారిలో కూడా పూర్తిగా చేరలేదు.
Published date : 20 Jun 2018 03:46PM