ఇంజనీరింగ్ కాలేజీలకు... ‘ఏఐసీటీఈ’ హెచ్చరిక
Sakshi Education
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కాలంలో ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తేరాదని, సిబ్బందిని తొలగించరాదని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ కాలేజీలను హెచ్చరించింది.
పలు రకాల ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని, సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, సిబ్బందిని తొలగిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరినైనా తొలగించినా, లాక్‌డౌన్ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకుంటారని, జీతాలు చెల్లిస్తారని లేకపోతే కాలేజీలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుత సెమిస్టర్‌కు క్లాసులు ఆన్‌లైన్‌లో కొనసాగుతాయని చెప్పారు. యూసీజీ త్వరలో పరీక్షలు, సంబంధిత వివరాలతో రివైజ్డ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ స్కీమ్ కింద రావాల్సిన నిధులు ఆగిపోయాయని, లాక్‌డౌన్ అనంతరం పరిస్థితులు సర్దుకుంటాయని చెప్పారు.
Published date : 17 Apr 2020 01:55PM