Skip to main content

ఇంజనీరింగ్ డిటెన్షన్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో డిటెన్షన్‌కు గురయిన విద్యార్థుల పోరాటం ఫలించింది.
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించా లని డిమాండ్ చేస్తూ పక్షం రోజులుగా విద్యార్థులు జేఎన్‌టీయూలో ఆందోళ నలు చేపడుతున్నారు. వారి డిమాండ్‌ను తాజాగా అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. 2016-17 విద్యాసంవత్సరం ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యా ర్థులు సెమిస్టర్ పరీక్షల్లో పెద్ద సంఖ్యలో ఫెయిలయ్యారు. దాదాపు 45 శాతం విద్యార్థులకు నిర్దేశిత క్రెడిట్ పాయింట్లు రాకపోవడంతో వారికి డిటెన్షన్ కోటాలో చేర్చారు. దీంతో వారిని సెకండియర్‌లోకి అనుమతించకుండా కాలేజీ యాజమాన్యాలు పేర్లు తొలగించాయి. ఈక్రమంలో ఆయా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి డిటెన్షన్ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ప్రమోషన్ అవ్వాలి. అందుకు ఏడాది కాలం వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో అడ్వాన్‌‌స సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు వర్సిటీలో వరుసగా ఆందోళనలు చేపట్టారు. దీంతో స్పందించిన వర్సిటీ యాజమాన్యం అడ్వాన్‌‌స సప్లిమెంటరీ పరీక్షలకు అంగీకరిస్తూ జూలై 31న ఒక ప్రకటన విడు దల చేసింది. తాజాగా డిటైండ్ అయిన విద్యార్థులను సెకండియర్ తరగతులకు అనుమతించాలని కళాశాల యాజమాన్యాలకు జేఎన్‌టీయూహెచ్ సూచించింది. అయితే ఈ హాజరు ప్రక్రియంతా షరతులతో కూడిన విధంగా వెసులుబాటు కల్పించింది. అడ్వాన్‌‌స సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రమోట్ అయితేనే వీరు సెకం డియర్ సెమిస్టర్ పరీక్షలు రాసే వీలుంటుంది. క్రెడిట్ పాయింట్ల ఆధారంగానే తదుపరి తరగతికి ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. అడ్వాన్‌‌స సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి వర్సిటీ త్వరలో తేదీలు ప్రకటించనుంది.
Published date : 01 Aug 2017 01:50PM

Photo Stories