ఇంజినీరింగ్, బీఫార్మసీ ఫస్టియర్ విద్యార్థులకు ఊరట
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) పరిధిలో ఇంజినీరింగ్, బీఫార్మసీ ఫస్టియర్‌లో డిటెన్షన్‌కు గురైన విద్యార్థులకు ఊరట లభించింది.
ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈనెల లేదంటే సెప్టెంబర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఆ వర్సిటీ స్పష్టం చేసింది. జేఎన్‌టీయూహెచ్ అకడమిక్ సెనెట్ స్టాండింగ్ కమిటీ మంగళవారం సమావేశమైంది. డిటెన్షన్ కారణంగా విద్యా సంవత్సరానికి దూరమవుతున్న నేపథ్యంలో విద్యార్థికి మేలు చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది వరకు ఫస్టియర్‌లో వార్షిక పరీక్షలు ఉండేవి. ఇకపై ఈ ఏడాది నుంచి ఫస్టియర్‌లోనూ సెమిస్టర్ విధానంలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదయ్య తెలిపారు. పరీక్షలు పూర్తయ్యాక వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
జేఎన్‌టీయూ పరిధిలో గతేడాది కంటే ముందు ఫస్టియర్‌లో క్రిడిట్స్ విధానం లేకపోయేది. ప్రథమ సంవత్సరంలో సబ్జెక్టుల పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా కేవలం నిర్దేశిత ఉత్తీర్ణత ఆధారంగా సెకండియర్‌కు ప్రమోషన్ చేసే పద్ధతిని అవలంబించారు. ఈ క్రమంలో సబ్జెక్టుపై పట్టు, ఎటువంటి నైపుణ్యాలు లేని విద్యార్థులుగా.. ఇంజినీరింగ్ పట్టభద్రులు తయారవుతున్నారని వర్సిటీ భావించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, బీఫార్మసీ ఫస్టియర్‌లో గతేడాది క్రెడిట్స్ విధానాన్ని నూతనంగా ప్రవేశ పెట్టారు. ఫస్టియర్‌లో ఉన్న మొత్తం 56 క్రెడిట్స్‌కిగాను.. కనిష్టంగా 28 క్రెడిట్స్ సాధించిన విద్యార్థులనే సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. తద్వారా వర్సిటీ నిర్దేశించిన క్రెడిట్స్‌ని అందుకోలే క పోయిన 13 వేల మంది విద్యార్థులకుపైగా డిటెన్షన్ వేటు పడింది. బీటెక్ ఫస్టియర్ పరీక్షలకు 48,331 మంది హాజరుకాగా.. 12,344, బీఫార్మసీ పరీక్షలు 4,767 మంది రాయగా.. అందులో 741 మంది 28 క్రెడిట్స్ సాధించలేక చతికిలపడ్డారు. వీరంతా 2016-17 విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఈ అంశాన్ని స్పృశిస్తూ సాక్షి ప్రచురితం చేసిన కథనం ద్వారా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
తాజా నిర్ణయాలు..:
వాస్తవంగా సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్/నవంబర్‌లో నిర్వహిస్తుంటారు. 2015-16లో ఫస్టియర్‌లో ప్రవేశ పొందిన విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించక పోవడంతో వీరికోసం సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు/సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. ఈ అవకాశం ఈ ఒక్క బ్యాచ్‌కే. ‘సప్లిమెంటరీలోనూ నిర్ణీత క్రెడిట్స్ సాధించకపోతే డిటెన్షన్‌కు సిద్ధమే’ అని పేర్కొంటూ వర్సిటీకి విద్యార్థులు హామీ పత్రాన్ని తప్పక సమర్పించాలి. అటువంటి వారికే పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తారు. సప్లిమెంటరీ పరీక్ష ద్వారా 28, ఆపై క్రెడిట్స్ సాధించిన విద్యార్థులే సెకండియర్‌కు ప్రమోట్ అవుతారు. మిగిలిన వారు ఈ విద్యా సంవత్సరం నష్టపోవాల్సిందే. వీరికి మరో సప్లిమెంటరీ పరీక్ష ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించరు. పరీక్షల నిర్వహణ, ఒప్పంద పత్రాల అందజేత ప్రక్రియ పూర్తయ్యే వరకు డిటెన్షన్ వేటు పడ్డ విద్యార్థులు సెకండియర్ తరగతులకు హాజరుకావచ్చు.

Published date : 10 Aug 2016 02:47PM