Skip to main content

BTech courses: BTech కోర్సుల్లో ఆనర్స్‌ విధానం

BTech courses,VC Prof. Jinka Ranga Janardana announces , honors system in B.Tech courses
BTech courses

అనంతపురం: జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో బీటెక్‌ కోర్సుల్లో ఆనర్స్‌ విధానం తీసుకురానున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ జింకా రంగ జనార్దన అన్నారు. యూనివర్సిటీలోని ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో శనివారం వీసీ అధ్యక్షతన జరిగిన ఆరవ బీటెక్‌ ప్రోగ్రాం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ కామన్‌ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీటెక్‌ కోర్సు విద్యాప్రణాళిక పునఃపరిశీలనలో భాగంగా మార్పుచేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. రెగ్యులర్‌ కోర్సుతో పాటు ఆనర్స్‌ డిగ్రీని ప్రవేశపెడుతున్నామన్నారు.

ఆనర్స్‌ డిగ్రీ పొందాలంటే 15 క్రెడిట్‌లను అదనంగా సాధించాల్సి ఉంటుందన్నారు. 5 ప్రొఫెషనల్‌ ఎలక్టీవ్స్‌, 4 ఓపెన్‌ ఎలక్టీవ్స్‌, 5 ఓరియంటెడ్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పాలసీని ప్రవేశపెడుతున్నామన్నారు. రెండు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లను రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చివరలో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీటికి 8 వారాల వ్యవధిని ఇస్తామన్నారు. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ప్రాజెక్ట్‌ లేదా ఇంటర్న్‌షిప్‌ సెమిస్టర్‌ మొత్తం ప్రవేశపెడుతున్నామన్నారు.

వీటితో పాటు ఆడిట్‌ కోర్సులను పూర్తి చేయాలన్నారు. రెగ్యులర్‌ డిగ్రీలో మూడో సెమిస్టర్‌ వరకు 7 సీజీపీఏ సాధించిన విద్యార్థులు మాత్రమే డిగ్రీ రిజిస్టర్‌ చేసుకోవడానికి అనుమతి ఇస్తామన్నారు. డిగ్రీలో మల్టీ ఎగ్జిట్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మొదటి సంవత్సరం సిలబస్‌కు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌, ప్రిన్సిపాల్‌ ఎస్‌వీ సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణకాంతి, ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, కృష్ణా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ కేబీ చంద్రశేఖర్‌, పాలకమండలి సభ్యులు డాక్టర్‌ రామశేఖర్‌రెడ్డి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

Published date : 20 Sep 2023 10:24AM

Photo Stories