Skip to main content

హైదరాబాద్‌లో మహీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్- ఫ్రాన్స్ వర్సిటీ ఎకోల్ సెంట్రల్‌తో భాగస్వామ్యం

హైదరాబాద్: రాష్ట్రంలో ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్ వంటి విద్యాసంస్థల సరసన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చేరబోతోంది. ట్రాక్టర్లు, కార్లు, రవాణా వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన మహీంద్ర గ్రూప్ హైదరాబాద్‌లో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ) ఇంజనీరింగ్ కాలేజీని స్థాపిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఎకోల్ సెంట్రల్ భాగస్వామ్యంతో బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర క్యాంపస్ (గతంలో సత్యం క్యాంపస్)లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల వ్యయంతో నెలకొల్పుతోంది. ఇప్పటికే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల సమీకృత ఎంటెక్ కోర్సును అందించేందుకు జేఎన్‌టీయూహెచ్‌తో ఒప్పం దం చేసుకుంది. వచ్చే ఏడాదే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ-మెయిన్ ర్యాంకుల ఆధారంగా కాలేజీ సీట్లు భర్తీ చేయనున్నారు. తొలి ఏడాది 300 సీట్లు, రెండో ఏడాది 360 సీట్లు, మూడో ఏడాది 420 సీట్లు భర్తీచేయనున్నారు. తొలి ఏడాది సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్న తరుణంలో విద్యాసంస్థలకు పారిశ్రామిక అనుసంధానమనే ఆలోచనలతో మహీంద్ర గ్రూప్ ఎంఈసీని ఏర్పాటు చేస్తోంది.
Published date : 23 Dec 2013 12:07PM

Photo Stories