‘గేట్’లో తెలుగు వెలుగులు... ఇంజనీరింగ్ విభాగంలో భరత్‌రెడ్డికి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్
Sakshi Education
హైదరాబాద్: జాతీయస్థాయి అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ఎంటెక్ తదితర పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) - 2014 పరీక్షలో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. అత్యధిక సంఖ్యలో అర్హత సాధించారు. గేట్‌ను నిర్వహించిన ఖరగ్‌పూర్ ఐఐటీ గురువారం అర్థరాత్రి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలో మన రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంతోపాటు వివిధ బ్రాంచీల్లో టాప్ టెన్‌లో స్థానాలు దక్కించుకున్నారు. మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో కరీంనగర్‌కు చెందిన భరత్‌రెడ్డి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. సివిల్‌లో వరంగల్ నిట్‌లో చదువుతున్న అంకిత్‌వర్మ 3వ ర్యాంకు, రాపోలు జయప్రకాశ్‌కు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 9వ ర్యాంకు, విశాఖపట్టణానికి చెందిన సునీల్ వర్మ ఎంఈలో 5వ ర్యాంకు సాధించారు. మైనింగ్ విభాగంలో నల్లగొండ జిల్లాకు చెందిన కొత్త సాయిరాం 18వ ర్యాంకు సాధించాడు. ట్రిపుల్ ఐటీ బాసర, నూజివీడు విద్యార్థులు కూడా పలు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి టి.నవీన్ జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్‌కు చెందిన జి.మహేష్ ఈసీఈలో 25వ ర్యాంకు, శ్రీరాములు నాయుడు 30వ ర్యాంకు, ఆర్.నీలిమ 57వ ర్యాంకు, ఎంఎంఈలో ఎల్.కార్తీక్ 75వ ర్యాంకు సాధించినట్లు ఆర్‌జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ రాజ్‌కుమార్ తెలిపారు.
దేశవ్యాప్తంగా 1.49 లక్షల మంది అర్హత
గేట్‌కు దేశవ్యాప్తంగా 10,33,625 మంది దరఖాస్తు చేసుకోగా 8,89,156 మంది (86.02 శాతం) పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 30.17 శాతం బాలికలే. తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు 22 పేపర్లలో పరీక్షలు జరిగాయి. ఈసారి జీవావరణం, పరిణామక్రమంలో కొత్త పేపరును ప్రవేశపెట్టారు. ఐదు ప్రధాన పేపర్లలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈసీఈలో 2,16,367 మంది, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 1,85,578 మంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ)లో 1,55,190 మంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 1,41,799, సివిల్ ఇంజనీరింగ్‌లో 90,872 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంమీద 1,49,694 (16.84 శాతం) మంది అర్హత సాధించారు. వీరిలో 21,431 మంది బాలికలు ఉన్నారు. అర్హత సాధించిన వారిలో జనరల్ అభ్యర్థులు 85,063 మంది, ఓబీసీలు 42,287 మంది, ఎస్సీలు 17,085 మంది, ఎస్టీలు 4,224 మంది, వికలాంగులు 1,035 మంది ఉన్నారు. వీరందరికీ స్కోర్‌కార్డులు పంపనున్నట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ ఫలితాలను ఈనెల 28న విడుదల చేస్తామని ఖరగ్‌పూర్ ఐఐటీ ముందుగా పేర్కొన్నప్పటికీ, గురువారం అర్ధరాత్రే విడుదల చేసింది.
ఖరగ్‌పూర్ ఐఐటీలో పీజీ చేస్తా : భరత్‌రెడ్డి
గేట్ మైనింగ్ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఖరగ్‌పూర్ ఐఐటీలో పీజీ చేయాలన్నది లక్ష్యమని భరత్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన భరత్‌రెడ్డి తండ్రి ఇంద్రసేనారెడ్డి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్. తల్లి లక్ష్మి గృహిణి. తమ్ముడు భార్గవ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. భరత్‌రెడ్డికి పదో తరగతిలో 552 మార్కులు, ఇంటర్‌లో 946 మార్కులు వచ్చాయి. జేఈఈలో 5,900 ర్యాంకుతో జార్ఖండ్ ఐఐటీలో సీటు వచ్చిందని భరత్‌రెడ్డి చెప్పాడు. ముందస్తు ప్రణాళికతో చదివానని, సబ్జెక్టుపై పూర్తిస్థాయి పట్టు సాధించగలిగానని, అందువల్లే గేట్‌లో ర్యాంకు వచ్చిందని తెలిపాడు.
జయప్రకాశ్‌కు 73.67 శాతం మార్కులు
కేసముద్రం: గేట్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 9వ ర్యాంకు సాధించిన రాపోలు జయప్రకాశ్ స్వస్థలం వరంగల్ జిల్లా కేసముద్రం. కేసముద్రం స్టేషన్‌కు చెందిన రాపోలు శ్రీనివాస్, మంజుల దంపతుల కుమారుడు జయప్రకాశ్ పదో తరగతి మానుకోటలోని మహర్షి విద్యాలయంలో చదివాడు. ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివి, అనంతరం వరంగల్ నిట్ కళాశాలలో బీటెక్‌లో చేరాడు. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నాడు. జయప్రకాశ్‌కు గేట్‌లో 73.67 మార్కులు వచ్చినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు.
వీర్లపాలెం విద్యార్థి కొత్త సాయిరాం ప్రతిభ
దామరచర్ల:గేట్ మైనింగ్ విభాగంలో 18వ ర్యాంకు పొందిన కొత్త సాయిరాం స్వస్థలం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం. కొత్త రాఘవేంద్రప్రసాద్, పద్మావతిల కుమారుడు సాయిరాం ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతను 7వ తరగతి వరకు కోదాడ పబ్లిక్ స్కూల్లో, 8 నుంచి 10 వరకు కోదాడలోని సిటీ టాలెంట్ స్కూల్లో, ఇంటర్ గూడవల్లి కేకేఆర్ గౌతం జూనియర్ కళాశాలలో చదివాడు. ఎంసెట్‌లో 720వ ర్యాంక్ సాధించాడు. అనంతరం ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటు సాధించాడు. సాయిరాం తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

Published date : 29 Mar 2014 11:31AM