Skip to main content

గేట్ ర్యాంక ర్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం

- రెండు రకాల జాబితాలు పంపిన జేఎన్టీయుూహెచ్
- మొదటి జాబితాలో 61 ఫార్మసీ, 145 ఇంజనీరింగ్ కాలేజీలు
- రెండో జాబితాలో 43 ఫార్మసీ, 124 ఇంజనీరింగ్ కాలేజీలు
- ఆప్షన్లు ఇచ్చుకోవడంలో అభ్యర్థుల అయోమయం

సాక్షి, హైదరాబాద్: గేట్/జీప్యాట్ ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. ఈనెల 6,7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆదివారం వరకు అవకాశం కల్పించా రు. అవసరమైన పక్షంలో గడువును పొడిగిస్తామని పీజీ ఈసెట్ అధికారులు తెలిపారు. జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా సకాలంలో కౌన్సెలింగ్ అధికారులకు చేరనందున ఈనెల 10 నుంచి ప్రారంభం కావాల్సిన గేట్/ జీ ప్యాట్ అభ్యర్థుల ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా పీజీ ఈసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు ఇప్పటివరకు 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

కౌన్సెలింగ్కు రెండేసి జాబితాలు
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క జాబితానే కౌన్సెలింగ్ అధికారులకు అందగా, జేఎన్టీయూహెచ్ రెండేసి జాబితాలను పంపడం విశేషం. పీజీ కళాశాలలకు అఫిలియేషన్ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదటి జాబితాలో 145 ఇంజనీరింగ్, 61 ఫార్మసీ కళాశాలల పేర్లు ఉండగా, రెండవ జాబితాలో 124 ఇంజనీరింగ్, 43 ఫార్మసీ కళాశాలలున్నాయి. లోపాలున్న కళాశాలల్లో సిబ్బంది, మౌలిక వసతులపై వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీచేశామని అధికారులు తెలిపారు. నివేదికలు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగియగా, 60 కాలేజీలే స్పందించాయి.

అభ్యర్థుల అయోమయం
వెబ్ కౌన్సెలింగ్కు జేఎన్టీయూహెచ్ పంపిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాల్లో ఎలాంటి షరతులతో అఫిలియేషన్ ఇచ్చారో అధికారులు స్పష్టంగా పేర్కొనలేదు. అంతేకాదు.. ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంటూ అభ్యర్థులకు అవగాహన నిమిత్తం కొంత సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టారు. తాము ఆప్షన్లు ఇచ్చిన అన్ని కళాశాలలకు చివరి నిమిషంలో అఫిలియేషన్ రద్దు చేసినట్లైతే తమకు సీట్లు ఎలాగని అభ్యర్థులు వాపోతున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు పీజీ అడ్మిషన్ల విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించే
నిమిత్తం అధికారులు పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి

ఈనెల 9న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలమేరకు ఎంటెక్/ఎంఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశానికై వెబ్ కౌన్సెలింగ్కు అఫిలియేటెడ్ కళాశాల జాబితాలను రెండేసి చొప్పు న కౌన్సెలింగ్ అధికారులకు పంపాం.

జేఎన్టీయూహెచ్/ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు ఆయా క ళాశాలల్లో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధించి అవసరమైన ఫ్యాకల్టీ, మౌలిక వసతుల నివేదిక ఆధారంగానే అఫిలియేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. అఫిలియేషన్ రాని కళాశాలల్లో చేరిన విద్యార్థుల విషయుంలో వర్సిటీ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ మేరకు ముందుగానే అండర్టేకింగ్ తీసుకుంటాం.

హైకోర్టు ఆదేశాల ప్రకారం కళాశాలల నుంచి సమాచారం సేకరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది కోర్సుల నిర్వహణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా అకడమిక్ కేలండర్ను అమలు చేయడం ఈ సారి మా నియంత్రణలో లేదు.

ఈ విద్యా సంవత్సరం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల మేరకు సీట్ల కేటాయింపు(అలాట్మెంట్లెటర్) లను కేసు ముగిసేవరకు విత్హెల్డ్లో పెడతాం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతాం.
Published date : 14 Sep 2014 02:57PM

Photo Stories