Skip to main content

గేట్ ఫలితాలు విడుదల

ఎంటెక్, నేరుగా పీహెచ్‌డీల్లో ప్రవేశాలు<br/> ప్రభుత్వరంగ సంస్థల్లో ట్రైనీ ఇంజనీర్లుగా ఉద్యోగాలు
హైదరాబాద్: జాతీయస్థాయి అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్‌లో ఎంటెక్ తదితర పీజీ ఇంజినీరింగ్ కోర్సులు, నేరుగా పీహెచ్‌డీల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) -2015 ఫలితాలు విడుదల అయ్యాయి.

ఈ ఫలితాలను కాన్‌పూర్ ఐఐటీ గురువారం విడుదల చేసింది. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 29 వరకు స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ కాన్‌పూర్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ- ముంబయి, ఐఐటీ -ఢిల్లీ, ఐఐటీ- గౌహతి, ఐఐటీ- కాన్‌పూర్, ఐఐటీ- ఖర్‌గ్‌పూర్, ఐఐటీ -మద్రాసు, ఐఐటీ- రూర్కీల్లో గేట్ స్కోర్ ఆధారంగానే పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే గేట్ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వరంగ సంస్థలైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ తదితర సంస్థలు విద్యార్థులను ట్రైనీ ఇంజనీర్లుగా తీసుకుంటున్నాయి.
Published date : 13 Mar 2015 02:01PM

Photo Stories