గేట్-2020 దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: గేట్-2020 దరఖాస్తు గడువును సెప్టెంబరు 28 వరకు ఐఐటీ ఢిల్లీ అధికారులు పొడిగించారు.
సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటికి రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 24తోనే దరఖాస్తు గడువు ముగిసింది. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అయితే సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 30 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2020 పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.
Published date : 26 Sep 2019 04:26PM