గేట్-2018 షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 2018-19 విద్యా సంవత్సరంలో ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను నిర్వహించనున్న గేట్-2018 పరీక్ష షెడ్యూల్ జారీ అయింది.
ఈ షెడ్యూల్‌ను పరీక్ష నిర్వహణ సంస్థ గువహటీ-ఐఐటీ జారీ చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది ఈ పరీక్షకు 11 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా, 16 శాతం మంది అర్హత సాధించారు.
ఇదీ పరీక్ష షెడ్యూల్..
ఇదీ పరీక్ష షెడ్యూల్..
- ఎన్‌రోల్‌మెంట్, గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టిమ్ (జీవోఏపీఎస్) వెబ్‌సైట్ 2017 సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
- దరఖాస్తు సమర్పించడానికి తుది గడువు 5 అక్టోబర్ 2017
- పరీక్ష కేంద్రాన్ని మార్చుకునేందుకు తుది గడువు 17 నవంబర్ 2017
- అడ్మిట్ కార్డు అందుబాటులోకి వచ్చేది 5 జనవరి 2017
- పరీక్ష తేదీలు: 2018 ఫిబ్రవరి 3, 4, 10, 11
- ఫలితాలు వెల్లడించేది 17 మార్చి 2018
Published date : 06 Jul 2017 10:58AM