గేట్-2018 దరఖాస్తులు ప్రారంభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2018) పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు గువాహటీ ఐఐటీ తెలిపింది.
అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 3, 4, 10, 11వ తేదీల్లో గేట్ పరీక్షను నిర్వహించనున్నారు.
Published date : 01 Sep 2017 01:58PM