గేట్-2015 దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఐటీలు, ఇతర యూనివర్సిటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 1 కాగా అక్టోబర్ 14 వరకు గడువును పొడిగించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా నిర్దేశిత సర్టిఫికెట్లను, ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఫీజును కూడా నెట్ బ్యాంకింగ్/డెబిట్‌కార్డ్/క్రెడిట్ కార్డ్ విధానాల్లో చెల్లించాలి. ప్రింటవుట్ దరఖాస్తును పంపాల్సిన అవసరం లేదు. గేట్-2015ను ఐఐటీ-కాన్పూర్ నిర్వహించనుంది. జనవరి 31, ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. వచ్చే ఏడాది మార్చి 12న గేట్ ఫలితాలు వెలువడే అవకాశముంది. వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల భర్తీకి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
వెబ్‌సైట్: gate.iitk.ac.in/
వెబ్‌సైట్: gate.iitk.ac.in/
Published date : 19 Sep 2014 12:07PM