ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్-2017 తుదివిడత సీట్ల కేటాయింపు ఆగస్టు 8న పూర్తయింది.
తుది విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు జాబితాలను అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ జీఎస్ పండాదాస్ విడుదల చేశారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు. తుది విడత కౌన్సెలింగ్‌లోనూ ఇంకా 32,178 సీట్లు మిగిలిపోయాయి. తుది విడత కౌన్సెలింగ్‌కు ఆగస్టు 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. మొత్తం 1,45,433 మంది ఎంసెట్ అర్హులకు గాను 77,143 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. తుది విడతలో 13,379 మంది ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలో 467 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 98,251 సీట్లుండగా.. మొత్తం మూడు విడతల్లోనూ 66,073 సీట్లు భర్తీఅయ్యాయి. ఇంకా 32,178 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. ఈసీఈలో 5,280, కంప్యూటర్ సైన్‌సలో 4,289, మెకానికల్‌లో 6,985, ఈఈఈలో 5,561, సీట్లు మిగిలి పోయాయి. ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు 5 ఉండగా 50 మంది లోపు విద్యా ర్థులున్న కాలేజీలు 54 ఉన్నాయి. చివరి కౌన్సెలింగ్‌లో 13,379 మంది ఆప్షన్లు ఇచ్చినా 2,040 మందికి మాత్రమే సీట్లు కేటాయింపులు జరిగాయి.
ఆగస్టు 11వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి: అభ్యర్థులు ఆగస్టు 11 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత జాయినింగ్ ఆర్డర్ కాపీని, సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో చేరాలని కన్వీనర్ సూచించారు.
ఆగస్టు 11వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి: అభ్యర్థులు ఆగస్టు 11 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత జాయినింగ్ ఆర్డర్ కాపీని, సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో చేరాలని కన్వీనర్ సూచించారు.
Published date : 09 Aug 2017 03:46PM