ఏపీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ప్రత్యేక బృందాలు డిసెంబర్ 12నరాష్ట్రంలోని 25 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచే క్రమంలో ఆయా కళాశాలల్లోని పరిస్థితులను తెలుసుకోవడానికి వీలుగా ఈ తనిఖీలు జరిపాƇ¬.
ఆయా కాలేజీల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, ప్రమాణాల లేమిని కమిషన్ బృందాలు గుర్తించాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకపోగా నిర్ణీత అర్హతలు కలిగిన ఇతర సిబ్బంది కూడా పలు కాలేజీల్లో కరువయ్యారని వెల్లడైంది. పలు కళాశాలల్లో ల్యాబ్‌లు లేకపోగా, ఉన్నచోట సైతం వాటిలో విద్యార్థులతో పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేయించడం లేదని తేలింది. డిసెంబర్ 13న కూడా కాలేజీల తనిఖీలు కొనసాగనున్నాయని ఉన్నత విద్యా వర్గాల సమాచారం.
Published date : 13 Dec 2019 04:58PM