ఏపీ ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కన్వీనర్ కోటా ఎంసెట్ సీట్ల కేటాయింపు తొలివిడత ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 331 కళాశాలలున్నాయి.
ఫార్మసీ సీట్లు కేటాయింపు
మేనేజ్‌మెంట్ కోటా భర్తీపై తర్జనభర్జన
ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఎ-కేటగిరీ (కన్వీనర్ కోటా) సీట్ల తొలివిడత కేటాయింపును పూర్తిచేసిన ఉన్నత విద్యామండలి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై తర్జనభర్జన పడుతోంది. గతేడాది మేనేజ్‌మెంట్ (బి-కేటగిరీ) కోటా సీట్ల భర్తీని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో చేపట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీజీజీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండడంతో ఏపీ ఎంసెట్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వానికి నివేదించామని విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
ఇందులో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు 13, ఫార్మసీ కాలేజీలు 14, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు 304 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 1,12,525 సీట్లుండగా తొలివిడత కౌన్సెలింగ్‌లో 73,817 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 38,708 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. మొదటి సంవత్సరం తరగతులు జూలై రెండో తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏపీ ఉన ్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్ సీట్ల కేటాయింపు వివరాలను ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సమావేశంలో మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, ప్రొఫెసర్ పి.నరసింహారావు, చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్, మండలి ఇన్‌ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌లో 67.5 శాతం, ఫార్మసీలో 17.42 శాతం సీట్లు భర్తీ అయ్యాయని ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, 11వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు వెబ్ లాగిన్‌లో లేదా హెల్ప్‌లైన్ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. కేటాయించిన కాలేజీలకు జూలై 1లోగా వెళ్లి అడ్మిషన్లు పొందాలని చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందినప్పటికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు, ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించరాదని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ నిలిపివేత
నకిలీ క్రీడా ధ్రువపత్రాల వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరుగుతున్నందున రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సూచన మేరకు స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీని నిలిపివేశామని ప్రొఫెసర్ వేణుగోపాల్‌రె డ్డి తెలిపారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలన కోసం శాప్‌కు పంపిస్తున్నామని, అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత సీట్ల భర్తీ చేపడతామన్నారు.
207 కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం!
ప్రస్తుత వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయింపు గణాంకాలను పరిశీలిస్తే 207 కాలేజీలు నిరర్థకాలుగా తేలుతున్నాయి. సగాని కిపైగా సీట్లు భర్తీ అయితేనే కాలేజీలు మనుగడ సాధించగలుగుతాయి. నిర్దేశిత సం ఖ్యలో విద్యార్థులు లేని కళాశాలల మనుగడ కష్టమేనని ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో అర్హులైన వారందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం గతేడాది మాదిరి గానే యథాతథంగా కొనసాగిస్తారని స్పష్టం చేశారు. 10 వేల లోపు ర్యాంకులు సాధిం చినవారికి పూర్తిగా ఫీజులు చెల్లిస్తారని, ఆపైన ర్యాంకుల వారికి అర్హతలను అనుసరించి రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తారన్నా రు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొం దిన విద్యార్థులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లోని సూచనలను అనుసరించాలని చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ సూచించారు.
ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు : | 3,668 |
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు : | 1,04,580 |
తొలివిడతలో భర్తీ అయిన సీట్లు : | 73,072 |
ఖాళీగా ఉన్న సీట్లు : | 35,176 |
ఫార్మసీ సీట్లు కేటాయింపు
యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీల్లో సీట్లు : | 265 |
ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో సీట్లు : | 4,012 |
తొలివిడతలో భర్తీ అయిన సీట్లు : | 745 |
ఖాళీగా ఉన్న సీట్లు : | 3,532 |
మేనేజ్‌మెంట్ కోటా భర్తీపై తర్జనభర్జన
ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఎ-కేటగిరీ (కన్వీనర్ కోటా) సీట్ల తొలివిడత కేటాయింపును పూర్తిచేసిన ఉన్నత విద్యామండలి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై తర్జనభర్జన పడుతోంది. గతేడాది మేనేజ్‌మెంట్ (బి-కేటగిరీ) కోటా సీట్ల భర్తీని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో చేపట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీజీజీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండడంతో ఏపీ ఎంసెట్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వానికి నివేదించామని విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
Published date : 27 Jun 2015 11:00AM