Skip to main content

Engineering fee: కొలిక్కి రాని ఇంజనీరింగ్‌ ఫీజులు

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేట్టు కన్పించడం లేదు. కొన్ని కా లేజీలతో సెప్టెంబర్ 26 నుంచి మూడో దఫా చర్చలకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) సిద్ధమైంది.
Engineering colleges do not accept new fee structure
Engineering colleges do not accept new fee structure

చర్చలకు హాజరు కావాల్సిందిగా 25 కాలేజీలను కోరింది. అయితే ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులను ఈ కాలేజీలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో చర్చలకు హాజరైనా ఇదే వాదన విని్పంచేందుకు సిద్ధమవుతు న్నాయి. మూడో దఫా సంప్రదింపుల అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 28 నుంచి మొదలవ్వాల్సి ఉంది. కానీ ఫీజులపై ప్రతిష్టంభన నెలకొనడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగించడమా? వాయిదా వేయడమా? అనే తర్జన భర్జనలో అధికారులున్నారు.  

Also read: DOST: ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సమస్య ఎక్కడ? 
ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్‌ ఫీజులను సమీక్షించే ఎఫ్‌ఆర్‌సీ 2022కు కూడా 2019 ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించింది. కోవిడ్‌ మూలంగా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 81 ప్రైవేటు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కాలేజీల ఆడిట్‌ నివేదికల ఆధారంగా నిర్ధారించిన ఫీజులను వసూలు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. అయితే తుది ఫీజుల ఖరారు బాధ్యత ఎఫ్‌ఆర్‌సీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కమిటీ కాలేజీల ఆడిట్‌ నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ క్రమంలో కొన్ని కాలేజీల ఫీజుల్లో భారీగా కోత పెట్టింది. బ్యాంకు నిల్వలు అధికంగా ఉన్నాయనే కారణాలు చూపించింది. దీనిపై 25 కాలేజీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో కమిటీ మరోసారి సంప్రదింపులకు సిద్ధమైంది. 

Also read: CBIT: సీబీఐటీ ఫీజు తగింపు

Published date : 26 Sep 2022 03:48PM

Photo Stories