ఎంటెక్‌లో తగ్గిన సీట్లు !
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంటెక్ సీట్లు 5 వేలకు పైగా తగ్గిపోయాయి.
కాలేజీల సంఖ్య పెరిగినా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సీట్లకు మాత్రం కోత విధించింది. గతేడాది 203 ఎంటెక్ కాలేజీల్లో 25,140 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి వాటిని 20,125కు కుదించింది. ఈ మేరకు అనుమతులు పొందిన కాలేజీలు, సీట్ల జాబితాను ఏఐసీటీఈ సాంకేతిక విద్యాశాఖకు పంపింది. ఎంఫార్మసీలోనూ అదే పరిస్థితి నెలకొంది. గతేడాది 126 ఎంఫార్మసీ కాలేజీల్లో 9,182 సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసీటీఈ ఈసారి 129 కాలేజీల్లో 8,743 సీట్లకే అనుమతి ఇచ్చింది.
Published date : 08 May 2018 03:37PM