ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్...సుప్రీం సుముఖం
Sakshi Education
ఇంజనీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తంచేసింది.
హైకోర్టు తీర్పును పట్టించుకోలేదు..
ఇదే సమయంలో కాలేజీల తరఫు న్యాయవాదులు గోపాలసుబ్రమణ్యం, రంజిత్ కుమార్, అభిషేక్ మనుసింఘ్వీ తమ వాదనలు వినిపించారు. వర్సిటీ గుర్తింపు ఇవ్వకపోవడం దగ్గరనుంచి హైకోర్టుకు వెళ్లడం వరకు అన్ని అంశాలను ధర్మాసనానికి వివరించారు. ‘2014-15 ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఇంజనీరింగ్ అడ్మిషన్ల సమయంలో ప్రమాణాలు సరిగా లేవంటూ దాదాపు 174 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ గుర్తింపునివ్వలేదు. దీంతో వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో ఆ కాలేజీలకు చోటు దక్కలేదు. దీనిపై అవి ఆగస్టు 25న హైకోర్టును ఆశ్రయించాయి. లోపాలన్నీ సవరించుకుంటామని, ప్రమాణాలు పాటిస్తామని ప్రమాణ పత్రం ఇవ్వాలని క ళాశాలలను హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో వీటిని కౌన్సెలింగ్ జాబితాలో చేర్చేందుకు అనుమతివ్వాలని యూనివర్సిటీని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఆ మేరకు కొన్ని కళాశాలలు ఆగస్టు 27న హామీ పత్రం సమర్పించినప్పటికీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించలేదు. మళ్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఆగస్టు 31ని కౌన్సెలింగ్ గడువు తేదీగా సుప్రీంకోర్టు నిర్ధారించినందున, సమయం దాటిపోయినందున తామేమీ చేయలేమని హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. నిజానికి ఈ కాలేజీల్లో చాలా వాటికి పీజీ కోర్సుల నిర్వహణకు ఇదే యూనివర్సిటీ అనుబంధ గుర్తింపునిచ్చింది. ఏఐసీటీఈ గుర్తింపుతో మేం చాలా ఏళ్లుగా కళాశాలలు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి తనిఖీలు చేసేందుకు వర్సిటీకి ఎలాంటి అధికారం లేదు’ అని కాలేజీల తరఫు లాయర్లు వాదించారు. దీంతో న్యాయమూర్తి కల్పించుకుని.. ‘డిగ్రీ ప్రదానం చేసేది యూనివర్సిటీ అయినప్పుడు తనిఖీ చేసేందుకు అధికారం లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. దీంతో లాయర్లు హైకోర్టు తీర్పును ప్రస్తావించారు.
సకాలంలో సిలబస్ పూర్తి చేయగలరా?
ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ... ఇప్పుడు తరగతులు ప్రారంభమైతే సకాలంలో సిలబస్ పూర్తి చేయగలరా? అని ప్రశ్నించారు. దీనికి వర్సిటీ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సమాధానమిస్తూ... ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 240 రోజుల పాటు క్లాసులు జరగాలని చెప్పారు. దీంతో న్యాయమూర్తి కల్పించుకుని.. ‘సాంకేతికపరమైన అంశాల జోలికి వెళ్లొద్దు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ విశాల దృక్పథంతో జరగాల్సింది. కానీ కొన్ని కళాశాలలను అనుమతించలేదు. ఇలాంటిది జరగకూడదు. ఎలాంటి వివక్ష ఉండకూడదు’ అని స్పష్టం చేశారు. సాల్వే తిరిగి తన వాదన వినిపిస్తూ ఏఐసీటీఈ కేవలం కాగితాలను చూసే అనుమతులు ఇస్తుందని, ప్రమాణాల తనిఖీ తామే చేయాల్సి ఉంటుందని వివరించారు. అప్పుడు న్యాయమూర్తి తిరిగి కల్పించుకుని ‘అంటే ఏఐసీటీఈ తనిఖీ చేసే విధానం మీరు తప్పంటారా?’ అని ప్రశ్నించారు. దీనికి సాల్వే బదులిస్తూ ‘మూడు నాలుగేళ్లుగా కళాశాలలు ప్రమాణ పత్రాలు ఇస్తూనే ఉన్నాయి. కానీ ప్రమాణాలను పాటించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలు కూడా ఇదే తేల్చాయి. దీని కారణంగా విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి’ అని వివరించారు. వాదనలన్నీ విన్న తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘కౌన్సెలింగ్ గడువు పొడిగించేందుకు మాకు ఇబ్బందేమీ లేదు. కానీ కాలేజీలన్నీ 15 రోజుల్లోగా ప్రమాణాలు పాటించగలవా? అన్ని వసతులు సమకూర్చగలవా?’ అని ప్రశ్నించారు. దీనికి కళాశాలల తరఫు న్యాయవాది గోపాల సుబ్రమణ్యం సమాధానమిస్తూ.. ‘మాకెలాంటి అభ్యంతరం లేదు. అన్ని నిబంధనలను సంతృప్తి పరుస్తాం’ అని బదులిచ్చారు. యూనివర్సిటీ తరఫు న్యాయవాది సైతం తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నవంబర్ 14లోగా కౌన్సెలింగ్ నిర్వహించగలరా? 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తే సకాలంలో సిలబస్ పూర్తి చేయగలుగుతారా? ఇదే సమయంలో ఆయా కళాశాలల్లో వర్సిటీ కూడా తనిఖీలు చేసుకోవచ్చు. ఒకవేళ నిబంధనలను సంతృప్తిపరచలేకపోతే అనుబంధ గుర్తింపు రద్దవుతుంది. అప్పుడు విద్యార్థుల అడ్మిషన్ కూడా రద్దవుతుంది’ అని పేర్కొన్నారు. దీనిపై వర్సిటీ తరఫు న్యాయవాదులు కల్పించుకుని.. ‘విద్యార్థులు ఫీజు నష్టపోతారు కదా’ అని సందేహం వ్యక్తం చేశారు. దీనికి బదులిస్తూ ‘ఫీజులను ప్రత్యేక ఖాతాలో నిర్వహించండి. సీటు రద్దయితే విద్యార్థికి అతని ఫీజు తిరిగి ఇచ్చేలా చూడొచ్చు. అయితే విద్యార్థులకు మాత్రం ముందే ఈ షరతులను వివరించాల్సి ఉంటుంది. అప్పుడు చేరాలా వద్దా అన్నది వారు నిర్ణయించుకునే వీలుంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. తరగతుల నిర్వహణ వివరాలను పొందుపరుస్తూ నివేదిక సమర్పించాలని కళాశాలలను ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ షెడ్యూలును పరిశీలించి ధర్మాసనం తగిన ఉత్తర్వులు జారీచేసే అవకాశముంది. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, జేఎన్టీయూహెచ్ తరఫున వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రమణారావు హాజరయ్యారు.
రోజుకో గంట అదనంగా తరగతులు
ఇంజనీరింగ్ రెండోదశ కౌన్సెలింగ్‌కు అవకాశం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసినందున యాజమాన్యాలు తరగతులను నిర్వహించే షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నాయి. సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు నవంబర్ 14 వ తేదీలోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తిచేశాక 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేలా పూర్తివివరాలతో షెడ్యూల్‌ను నేడు కోర్టులో దాఖలు చేయబోతున్నాయి. రోజుకో గంటసేపు అదనంగా తరగతులను నిర్వహించడంతోపాటు, రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో పనిచేయడం ద్వారా ప్రస్తుతం గడిచిన 45 రోజుల పనిదినాలను సర్దుబాటు చేయవచ్చునని సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నట్లు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి తిరుమల్‌రావు తెలిపారు.
EAMCET 2014 Mock Counselling | Click Here
EAMCET - 2014 Engineering Vacancy Position| Click Here
- కౌన్సెలింగ్ గడువు పొడిగింపునకు ఇబ్బందేమీ లేదు
- సకాలంలో సిలబస్ పూర్తి చేయగలరా?
- తరగతుల షెడ్యూల్ ఇవ్వాలని కాలేజీలకు ధర్మాసనం ఆదేశం
- 15 రోజుల్లో ప్రమాణాలు కల్పిస్తే కాలేజీలకు అనుబంధ గుర్తింపు
- ఒకవేళ గుర్తింపు పొందకపోతే అడ్మిషన్ల రద్దు, ఫీజు వాపస్
- ఈ షరతును వివరించాకే విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలి
- కాలేజీలు, జేఎన్టీయూహెచ్ సమ్మతి.. విచారణ నేటికి వాయిదా

Published date : 28 Oct 2014 01:29PM