ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
Sakshi Education
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అనంతరం ఇంజనీరింగ్,మెడిసిన్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించే యోచనలో ఉంది. ఇంటర్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంజనీరింగ్, మెడిసిన్ అడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం అధ్యయన కమిటీ తమిళనాడు వెళ్లనుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో ఎంసెట్ ర్యాంకులు ఆధారంగా ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేటాయిస్తున్నారు. అయితే ఎంసెట్ ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ మాత్రమే ఇస్తున్నారు.
Published date : 25 Jul 2014 05:34PM