ఏఐసీటీఈకి ఇంజనీరింగ్ కాలేజీల నివేదికలు
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్, 111జీవో పరిధిలో ఉన్న 238 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫిబ్రవరి 28 (శుక్రవారం)వరకు లోపాల సవరణకు చేపట్టిన చర్యలపై యాజమాన్యాలు ఇచ్చిన నివేదికలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో లోపాలున్న ఈ కాలేజీలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏఐసీటీఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీలనుంచి నివేదికలను తీసుకోవాలని జేఎన్‌టీయూను ఆదేశించింది. దీంతో జేఎన్ టీయూ యాజమాన్యాల నుంచి నివేదికలు కోరగా, ఇప్పటివరకు 86 కాలేజీలు మాత్రమే లోపాల సవరణకు చేపట్టిన నివేదికలను అందజేశాయి. అందులో జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలు 82 ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు 4 ఉన్నాయి. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటిపై చర్చించారు.
ముగిసిన గడువు
కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఇచ్చిన దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 5 వరకు ఉంది. మార్చి 5లోగా యాజమాన్యాలు ఇచ్చే లోపాల సవరణ నివేదికలను ఏఐసీటీఈకి పంపించాలని నిర్ణయించారు.

Published date : 29 Feb 2020 02:12PM