ఏఐసీటీఈ ఉచిత కోర్సులు
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఉచితంగా ఈ-లెర్నింగ్ కోర్సులు అందిస్తోందని ఆ సంస్థ జాతీయ చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచితంగా ఈ కోర్సులు అందించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని తమ వెబ్‌సైట్స్ వేదికగా వీటిని అందిస్తున్నామని చెప్పారు. మే 15లోపు రిజిస్టర్ చేసుకున్న విద్యార్ధులు వీటిని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం 26 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటా అనలిటిక్స్ టెస్టింగ్, బిగ్ డేటా, ఆర్ ప్రోగ్రామింగ్, జావా, డేటా సైన్స్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి అని చెప్పారు. వెబ్‌సైట్ www.free.aicte-india.org .
Published date : 15 Apr 2020 06:27PM